కశ్మీర్ కాంగ్రెస్ కూటమి చేతికి దక్కగా ఇక్కడ అతి త్వరలో కాంగ్రెస్ కూటమి సర్కారు ఏర్పడనుంది. 54 ఏళ్ల ఒమర్ అబ్దుల్లా కూటమి తరపున ముఖ్యమంత్రి అవుతారని ఆయన తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
జమ్ము కాశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఏకంగా 51 స్థానాలు సొంతం చేసుకుని తమ కూటమికి తిరుగు లేదని నిరూపించుకున్నాయి. బీజేపీ కేవలం 28 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావటంతో ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్థాత్మకంగా తీసుకున్నాయి. 10 ఏళ్ల తరువాత ప్రజలు తమకే పట్టం కట్టారని, పోలీస్ రాజ్ కాకుండా తాము ప్రజా పాలన చేస్తామని ఫరూక్ వెల్లడించారు.
మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమిపాలు కాగా పీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం అయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒక సీటు కైవసం చేసుకుని అకౌంట్ ఓపన్ చేయటం విశేషం. దోడా జిల్లాలో ఆప్ ఒక సీటు గెలుపొందింది.