పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ (Oparation Sindoor) పేరుతో పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా సైన్యం మెరుపు దాడులు చేసింది. అయితే ఈ దాడుల తర్వాత దాయాది దేశంపై భారత్ తదుపరి చర్యలు తీసుకుంటుందా..? లేదా..? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముంకుందే నరవణే(Manoj Naravane) తెరదించారు. ‘అబీతో పిక్చర్ బాకీ హై’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రకారం ‘ఆపరేషన్ సిందూర్’ కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అని హింట్ ఇచ్చారు. దీంతో ఇండియన్ ఆర్మీ తర్వాత చేయబోయే దాడులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అనే ఆసక్తి ఏర్పడింది. దీంతో భారత్ ఎప్పుడు ఎలాంటి దాడి చేస్తుందోనని పాక్ బిక్కుబిక్కుమంటుంది.