పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చేసుకుంది. ప్రధాని మోదీ (PM Modi) మూడు దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈనెలలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోదీ పర్యటించాల్సి ఉంది.
అయితే భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆయన విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లోనూ మోదీ పాల్గొనడం లేదని ప్రకటించాయి. కాగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.