Homeనేషనల్PM Modi: మోడీ 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలపై దుమారం

PM Modi: మోడీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం

న్యూఢిల్లీ(తెలుగుప్రభ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. పవిత్రమైన జాతీయ వేదికను రాజకీయ విమర్శలకు ప్రధాని వాడుకున్నారని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో విమర్శించాయి. ముఖ్యంగా ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సల్స్) అంటూ చేసిన వ్యాఖ్యలు అసమ్మతిని అణచివేసే ప్రయత్నమేనని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మరోవైపు, ప్రధాని ప్రసంగం దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని బీజేపీ అగ్రనేతలు సమర్థించారు.

- Advertisement -

‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన..
దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చే క్రమంలో యువత ‘దిమాగీ నక్సల్స్’ ప్రభావానికి లోనుకాకూడదని ప్రధాని హెచ్చరించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై గతంలో ‘అర్బన్ నక్సల్స్’ అన్నారని, ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అంటూ కొత్త ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై విద్యార్థులు, యువత అడుగుతున్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు. విపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నమిదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్లపై సవాల్..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసిరావాలని ప్రధాని పిలుపునివ్వడంపై విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పటికీ, డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టి అమలును ఆలస్యం చేస్తున్నారని ఆరోపించాయి. జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత స్థానాల్లోనే మహిళా కోటాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. ప్రధాని ప్రసంగం స్వదేశీ అభివృద్ధి, యువత సాధికారత, స్వయం సమృద్ధికి రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News