Sunday, December 8, 2024
Homeనేషనల్OYO Rooms : ఓయో ఉద్యోగులకూ తప్పని ఊస్టింగ్ బెడద.. అదే సమయంలో రిక్రూట్ మెంట్

OYO Rooms : ఓయో ఉద్యోగులకూ తప్పని ఊస్టింగ్ బెడద.. అదే సమయంలో రిక్రూట్ మెంట్

ఇటీవల కాలంలో చాలా వరకూ MNC కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటోంది. టాప్ పేయింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంటూ.. రాజీనామాలు చేయాలని ఈ-మెయిల్స్ పంపింది. ట్విట్టర్ మొదలు.. ఫేస్ బుక్, అమెజాన్ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా అదే బాటలో నడిచాయి. విదేశీ కంపెనీలే కాదు.. ఇప్పుడు దేశీయ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో టాప్ మోస్ట్ లాడ్జిలు, హోటల్స్ కూడా ఉండటం గమనార్హం.

- Advertisement -

తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు ఓయో సంస్థ వెల్లడించింది. అదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్లు తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని, భవిష్యత్ లో తిరిగి ఉద్యోగ నియామకాలు చేపడితే.. ప్రస్తుతం తొలగించబడిన వారికే ప్రాధాన్యతనిస్తామని పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News