Wednesday, May 21, 2025
Homeనేషనల్పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారుల అరెస్ట్..!

పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారుల అరెస్ట్..!

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి సున్నిత సమయంలో పంజాబ్‌లో చోటు చేసుకున్న ఓ కీలక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దేశ భద్రతను భంగపెట్టే ప్రయత్నంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో, పాకిస్తాన్ గూఢచారులుగా అనుమానిస్తున్న ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతంలో శనివారం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌లుగా గుర్తించారు. వారు భారత సైనిక స్థావరాలపై కీలక సమాచారం సేకరించి, ఫోటోలు తీసి విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఆర్మీ కంటోన్మెంట్, వైమానిక స్థావరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఆదివారం ట్విటర్‌లో ఈ అరెస్టులపై స్పష్టత ఇచ్చారు. అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న హర్ ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు, అలియాస్ హ్యాపీ ద్వారా వీరు పాకిస్తాన్ నిఘా ఏజెంట్లతో సంబంధాలు పెంచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. వారిని అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్ట్ చేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

ఈ దర్యాప్తు ఇంకా కీలక మలుపులు తిరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే వ్యక్తులపై చర్యల్లో ఒక్క చలనం ఉండదని డీజీపీ స్పష్టం చేశారు. “పంజాబ్ పోలీస్ శాఖ భారత సైన్యంతో కట్టుదిట్టంగా కలిసి పనిచేస్తోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో తాము ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటామన్నారు. భద్రతను భంగం చేసే యత్నాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అరెస్టులు, పాకిస్తాన్ గూఢచారుల కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి. దేశ భద్రత కోసం పోలీసు విభాగాలు, రహస్య సంశోదన సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News