Thursday, July 4, 2024
Homeనేషనల్PAN–Aadhaar link: ఆధార్–పాన్ లింక్ చేయలేదా.. మీకిదే చివరి అవకాశం.. లేదంటే

PAN–Aadhaar link: ఆధార్–పాన్ లింక్ చేయలేదా.. మీకిదే చివరి అవకాశం.. లేదంటే

PAN-–Aadhaar link: పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయలేదా? అయితే వెంటనే లింక్ చేయండి. లేకుంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ (ఐటీ) తాజాగా చివరి హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు పాన్–ఆధార్ లింక్ చేయకుంటే పాన్ రద్దవుతుందని తెలిపింది.

- Advertisement -

నిర్ణీత గడువులోపు ఆధార్ కార్డ్–పాన్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ సూచించింది. ఆధార్–పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతుంది. దీనికి చాలా గడువిచ్చింది. ఈ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఆ తర్వాత రూ.500 ఆలస్య రుసుముతో జూన్ చివరి వరకు అవకాశం కల్పించింది. తర్వాత జూలై 1 నుంచి వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఆధార్–పాన్ లింక్ చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రస్తుతం ఎవరైనా ఆధార్–పాన్ లింక్ చేసుకోవాలంటే రూ.1,000 ఆలస్య రుసుముగా చెల్లించాలి. ఈ గడువు కూడా 2023 మార్చి 31తో పూర్తవుతుంది. ఆలోపు ఆధార్–పాన్ లింక్ చేసుకోకపోతే పాన్ నిరుపయోగం అవుతుంది. అది చెల్లుబాటు కాదు. ఆధార్ లింక్ అయి ఉండకపోతే, ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుకు విలువ ఉండదు. దీని ద్వారా ఎలాంటి ఆదాయ పన్ను చెల్లింపులు వంటివి కొనసాగించలేరు. ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలు జరపాలంటే పాన్ నెంబర్ జత చేయాల్సిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆధార్ లింక్ చేయకపోతే, అలాంటి లావాదేవీలు చేయడానికి కూడా వీలుండదు.

బ్యాంకులో అధిక డబ్బు జమ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం, ట్రాన్స్‌ఫర్‌‌ చేసుకోవడం వంటివి కుదరదు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. అలాగే ఐటీ శాఖ చేసే రీఫండ్స్ కూడా ఆగిపోతాయి. తిరిగి రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. ఇలా లింక్ చేయని వారి వద్ద నుంచి అధిక పన్నులు కూడా వసూలు చేస్తారు. ‘ఐటీ యాక్ట్,1961’ ప్రకారం ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని ఐటీ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News