Tuesday, January 7, 2025
Homeనేషనల్Pani Puri: పానీపూరి బండితో ఏడాదిలో 40 లక్షల ఆదాయం.. ఇదేందయ్యా ఇది..!

Pani Puri: పానీపూరి బండితో ఏడాదిలో 40 లక్షల ఆదాయం.. ఇదేందయ్యా ఇది..!

పానీపూరి దీనిని ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా యువతకు పానీ పూరీ అంటే పిచ్చి. అందుకే చిన్న చిన్న నగరాల నుంచి.. పెద్ద పెద్ద సిటీల వరకు అడుగుకో పానీ పూరీ బండి మనకు దర్శన మిస్తుంది. ఇక పానీ పూరీ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇండియాలో జోరుగా సాగే వ్యాపారాల్లో పానీపూరీ టాప్-5లో ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు.

- Advertisement -

ఇదంతా పక్కన పెడితే. ఈ వ్యాపారం చేసేవాళ్ల ఆదాయం ఎంత ఉంటుంది అని ఎవరైనా అడిగితే.. మహా అయితే నెలకు ఓ 20 వేల వరకు మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. అయితే పానీపూరీ వ్యాపారం చేసేవాళ్ల సంపాదన గురించి తెలుసుకుని జాబ్ మానేసి పానీపూరీ బండి పెట్టుకోవడం బెటరేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది.

తమిళనాడులో రోడ్డు పక్కన బండి పెట్టుకుని పానీ పూరీ అమ్ముకుంటున్న ఒక వ్యక్తి.. ఏకంగా రూ.40 లక్షలు సంపాదించాడు. ఫోన్ పే(PhonePe), రేజర్ పే (Razorpay) ద్వారా ఆ పానీ పూరీ వ్యాపారికి రూ.40 లక్షలు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయంట. అన్ని లక్షల వ్యాపారం చేస్తున్నా GST రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఆ పానీ పూరీ వ్యాపారి ఫోన్ పే, రేజర్ పే ట్రాన్షాక్షన్స్ డేటా ఆధారంగా తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ అతనికి నోటీసులు జారీ చేసింది. అతనికి జారీ చేసిన నోటీసులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి రోడ్ల పక్కన చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వ్యాపారులకు GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు.. ఎందుకంటే వాళ్లు సంవత్సర ఆదాయం మహా అయితే రూ.10 లక్షలకు మించి దాటకపోవచ్చు. పోనీ వ్యాపారం ఎంత బాగా జరిగినా 15 లక్షలకు మించి జరగదనే భావన చాలా మందికి ఉంది. అయితే సెక్షన్ 22(1) జీఎస్టీ యాక్ట్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ టర్నోవర్ 20 లక్షల రూపాయలకు మించితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కానీ కొంత మంది వ్యాపారులకు ఈ విషయం తెలియదు. తమిళనాడుకు చెంది ఈ వ్యాపారి కూడా ఇక్కడే GST అధికారులకు దొరికిపోయాడు.

ఫోన్ పే, రేజర్ పే ద్వారా ఈ పానీ పూరీ వ్యాపారికి కస్టమర్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ 40 లక్షలు సంపాదించాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ 40 లక్షలు అతనికి ఫోన్ పే, రేజర్ పే ద్వారా వచ్చినవి మాత్రమే.. చేతికి వచ్చినవి ఎంతో లెక్క తెలియదు. దీనిపై కూడా సదరు వ్యాపారిని GST అధికారులు ఆరా తీస్తున్నారు. గత మూడేళ్లగా ఈ వ్యాపారికి ఇదే స్థాయిలో లాభాలు వస్తున్నాయని అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News