పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల(Parliament Sessions) తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు.. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 31న పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- Advertisement -
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్(Budget 2025)ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తొలి విడత సమావేశాల్లో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12న సెలవులు ఉండనున్నాయి.