Sunday, November 16, 2025
Homeనేషనల్Parliament logjam: అట్టుడుకుతున్న పార్లమెంట్.. అదానీ అంశంపై జపీసీకి విపక్షాల పట్టు..కొనసాగుతున్న వాయిదా పర్వం

Parliament logjam: అట్టుడుకుతున్న పార్లమెంట్.. అదానీ అంశంపై జపీసీకి విపక్షాల పట్టు..కొనసాగుతున్న వాయిదా పర్వం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అదానీ అంశం అట్టుడికిస్తోంది. దీంతో సభ సజావుగా సాగే పరిస్థితులు లేక సభలో గందరగోళం నెలకొంది. లోక్సభ, రాజ్యసభ రెంటిలోనూ సభా కార్యకలాపాలు స్థంభించిపోతున్నాయి. దీంతో ఇరు సభలో మధ్యహ్నం భోజన విరామం వరకూ వాయిదాబాట పట్టక తప్పలేదు. అదానీ కుంభకోణాలపై సభలో లోతైన చర్చ జరపాల్సిందేనంటూ వాయిదా తీర్మానాలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలు చర్చకు పట్టుబడుతున్నాయి.

- Advertisement -

అదానీ గ్రూపుల్లో జరుగుతున్న అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయకపోగా స్పందించటం లేదు. 16 పార్టీల విపక్ష పార్టీల బృందం పదేపదే ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad