Sunday, November 16, 2025
Homeనేషనల్Parliament Sessions | మళ్ళీ వాయిదాపడ్డ ఉభయసభలు

Parliament Sessions | మళ్ళీ వాయిదాపడ్డ ఉభయసభలు

సోమవారం వాయిదా పడిన పార్లమెంట్ వింటర్ సెషన్స్ (Parliament Winter Sessions) బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో కేసులు నమోదైన వ్యవహారంపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో ఉభయ సభల కార్యకలాపాలకు బ్రేక్ ఏర్పడింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభను కూడా ఛైర్మన్ జగదీప్ ధనడ్ 11.30 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదాల అనంతరం ఉభయ సభలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఉభయ సభల స్పీకర్లు సభని రేపటికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad