Friday, November 22, 2024
Homeనేషనల్Parliament Winter Sessions: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Winter Sessions: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Winter Sessions| పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 21 తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక నవంబర్ 26న ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరగనుంది. భారత రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ఈ ఉభయ సభలు జరగనున్నాయి. పాత పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ సభలో ఈ ప్రత్యేక ఉభయ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్థలంలోనే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిలో వన్ నేషన్- వన్ ఎలక్షన్(One nation-One election), వక్ఫ్ బోర్డు బిల్లులు ముఖ్యమైనవి. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బృందం ఇచ్చిన నివేదికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విధితమే. ఇటీవల ప్రధాని మోదీ(PM Modi) కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. దీంతో ఈ సమావేశాలలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్ సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. అలాగే రాజ్యసభలో 245 సీట్లలో 67% ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

మరోవైపు వివాదాదస్పదమైన వక్ఫ్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై ఏర్పడిన జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో సమర్పించనుంది. అయితే ఈ రెండు బిల్లులపై పార్లమెంట్‌తో తీవ్ర దుమారం రేగే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News