Sunday, December 8, 2024
Homeనేషనల్Patna High Court: 65 శాతం రిజర్వేషన్లు రద్దు!

Patna High Court: 65 శాతం రిజర్వేషన్లు రద్దు!

పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

పాట్నా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్‌లో 65 శాతం రిజర్వేషన్ల‌ను రద్దు చేసింది. 2023లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన పాట్నా హైకోర్టు.. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అవి రాజ్యాంగం అధికారాలకు అతీతమైనవి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం సమానత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని.. వాటిని రద్దు చేస్తూ తీర్పు వెల్ల‌డించింది.

- Advertisement -

నాడు బీహార్ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులో రిజర్వేషన్ కోటాలో షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం, ఇతర వెనుకబడిన తరగతులకు 43 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఓపెన్ మెరిట్ కేటగిరీ నుంచి వచ్చే వారికి రిజ‌ర్వేష‌న్ల‌ను 35 శాతానికి పరిమితం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించ‌గా రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News