Kalaburigi: కర్ణాటక రాష్ట్రంలోని కాలబురిగి పట్టణంలో ఓ భారీ దొంగతనం జరిగింది. పట్టణంలో పట్టపగలే మారాతుల్లా మాలిక్ అనే వ్యక్తికి సంబంధించిన బంగారు దుకాణంలో నలుగురు వ్యక్తులు దొంగతనం చేసారు. ఈ ఘటన జూలై 11న జరిగింది. అక్కడి పోలీసుల కథనం ప్రకారం ఫరూక్ అహ్మద్ తో కలిపి నలుగురు వ్యక్తులు మాలిక్ బంగారం దుకాణంకి వెళ్లారు. అక్కడ ఫరూక్ అహ్మద్ బయటనే ఉండి మిగితా ముగ్గురు లోపలకి చొరబడ్డారు.
మారతుల్లా మాలిక్ కాళ్లు, చేతులు కట్టేసి ఆ ముగ్గురు తుపాకీతో బెదిరించి లాకర్ లో ఉన్న 805 గ్రాముల బంగారం, డబ్బుతో పరారయ్యారు అని పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో బంగారం, డబ్బుతో బయటకి వచ్చిన ముగ్గురు ఫరూఖ్ అహ్మద్ తో ఏదో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోయారు. వెళ్లిన కాసేపటికే ఫరూఖ్ అదే ప్రాంతానికి చేరుకొని దగ్గరలో ఉన్న పావ్ భాజీ తినేసి వెళ్ళిపోయాడు.
Readmore: https://teluguprabha.net/national-news/112-air-india-pilots-sick-leave/
పావ్ భాజీ సెంటర్ లో ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లించినట్లు పోలీసులు గమనించారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు పావ్ భాజీ సెంటర్ కి వెళ్లి లావాదేవీల ద్వారా ఫరూఖ్ మొబైల్ నెంబర్ గుర్తించారు. దీంతో ఫరూఖ్ అహ్మద్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దాదాపు మూడు కిలోల బంగారం, కొంత నగదును అపహరించినట్టు నేరాన్ని అంగీకరించాడు. ఫరూఖ్ నుంచి 2.865 కేజీల బంగారు ఆభరణాలు, రూ.4.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Readmore: https://teluguprabha.net/national-news/villagers-build-road-chhattisgarh-dhamtari-protest/
ఇక్కడ మారాతుల్లా మాలిక్ తన దుకాణం మీద సోదాలు నిర్వహిస్తారు అని భయపడి తక్కువ బంగారాన్ని దోచుకెళ్లినట్లు ఫిర్యాదు చేసి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఫరూఖ్ తన వ్యాపారంలో రూ.40 లక్షల వరకు నష్టపోయినట్టు అందుకే మిగితా వారితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్టు నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.


