Friday, November 22, 2024
Homeనేషనల్Pepsi Co Layoff : పెరుగుతున్న నిరుద్యోగులు.. ఇప్పుడు పెప్సీకో వంతు..వందలాదిమంది ఇంటికే..

Pepsi Co Layoff : పెరుగుతున్న నిరుద్యోగులు.. ఇప్పుడు పెప్సీకో వంతు..వందలాదిమంది ఇంటికే..

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను తిరిగి తన హస్తగతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. వచ్చీరాగానే ఉద్యోగులపై వేటు వేశాడు. ఆ తర్వాత అది మిగతా సంస్థలకూ క్రమంగా వ్యాపించింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, అమెజాన్, హెచ్‌పీ, యాపిల్, జొమాటో, ఓయో ఇలా పసు సంస్థలన్నీ తమ ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ఒడిదొడుకులే ఇందుకు కారణంగా చెబుతున్నాయి. ముందుగా ఈమెయిల్స్ పంపి ఉద్యోగాలకు రాజీనామా చేయాలని కోరాయి. తాజాగా ఆ లిస్టులోకి పెప్సీకో కూడా చేరింది.

- Advertisement -

నార్త్ అమెరికాలోని స్నాక్ అండ్ బేవరేజెస్ యూనిట్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను పెప్సీ కో తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్’ జర్నల్ పేర్కొంది. ఉద్యోగులు అందుకున్న ఇంటర్నల్ మెమోలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థను మరింత సులభతరంగా మార్చడంలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ఈ విషయాన్ని పెప్సీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. చక్కెర, మొక్కజొన్న, బంగాళదుంపల ధరలు పెరగడంతో.. ఆ భారాన్ని పెప్సీ కో తన వినియోగదారులపై మోపుతున్నా.. ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాగా.. హెచ్ పీ సంస్థ 2025 నాటికల్లా తన సంస్థలో పనిచేసే 6 వేలమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ముందుగానే తెలిపింది. ఇక అమెజాన్ 20 వేల మందిని, మెటా సంస్థ 11 వేలమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపాయి. ఆర్థికమాంద్యం, ఉద్యోగాల బెడద.. ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News