Petrol-Diesel prices Hikes Again: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న (శుక్రవారం) లీటర్ పెట్రోల్‌పై రూ. 3 మేర పెరిగడంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అయితే, అందరికీ షాకిస్తూ మరోసారి పెట్రోల్, డీజిల్ పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి రూ.3 పెంపు చాలదని.. మరి కొద్ది రోజుల్లోనే భారీ పెంపు తప్పదని అంచనా వేశారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ. 10 వరకు పెరుగుతుందని ఎంకే గ్లోబల్ విశ్లేషకులు స్పష్టం చేశారు. అయితే, ఈ పెంపు ఒకేసారి గానీ లేదా రాబోయే 2 నుంచి 3 వారాల్లో దశలవారీగా గానీ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Also read: CM Chandrababu: పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద.. శ్రీకాకుళం పర్యటనలో సీఎం కామెంట్స్
లీటర్‌కు మరో రూ. 10 పెరిగే ఛాన్స్..
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సంక్షోభాల వల్ల ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో, ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకుని అధిక వ్యయం వెచ్చించి ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. అందుకే, నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇంధన ధరలను రూ. 3 మేర పెంచక తప్పలేదు. అయితే, ఈ స్వల్ప పెరుగుదలతో కంపెనీలు తమ రోజువారీ నష్టాలను పూడ్చుకోలేకపోతున్నామని చెబుతున్నాయి. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని సంకేతాలిస్తున్నాయి.

