HomeTop StoriesBreaking: వాహనదారులకు బిగ్ షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Breaking: వాహనదారులకు బిగ్ షాక్‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol and Diesel Prices hike: దేశవ్యాప్తంగా వాహనదారులకు చమురు సంస్థలు బిగ్ షాక్‌ ఇచ్చాయి. పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 చొప్పున భారీగా పెంచాయి. ఈ నూతన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు రూ. 3 చొప్పున పెరగగా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ. 3.29, డీజిల్‌పై రూ. 3.14 చొప్పున ధరలు పెరిగాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/dgp-cv-anand-reviews-the-performance-of-greyhounds-and-octopus/

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.50, డీజిల్ ధర రూ. 98.70 కి చేరింది. గుంటూరులో పెట్రోల్‌ రూ. 112.24, డీజిల్ రూ. 100.34కి ఎగబాకింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77, డీజిల్ రూ. 90.67, ముంబైలో పెట్రోల్ రూ. 106.68, డీజిల్ రూ. 93.14, కోల్‌కతాలో పెట్రోల్ రూ. 108.74, డీజిల్ రూ. 95.13, చెన్నై పెట్రోల్ రూ. 103.67, డీజిల్ రూ. 95.25కి చేరాయి. 

ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీనివల్ల సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోయి తీవ్ర కొరత ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లు దాటి దూసుకుపోవడంతో దేశీయంగా ధరలను పెంచక తప్పలేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 

Also Read: https://teluguprabha.net/sports-news/mumbai-indians-beat-punjab-kings-by-6-wickets-ipl-2026/

ఈ అకస్మాత్తుగా పెరిగిన ధరల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి, రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశంలో గత నాలుగేళ్లలో రిటైల్‌ ఇంధన ధరలు పెరగడం ఇదే మొదటిసారి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News