వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను మళ్లీ పెంచింది (Petrol, diesel Rate Hike). పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది.
- Advertisement -
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66, డీజిల్ ధర రూ.95.82గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82కు చేరనుంది.
ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.76, డీజిల్ ధర రూ.97.51గా ఉంది. పెరిగిన ఎక్సైజ్ డ్యూటీతో పెట్రోల్ ధర రూ.111.76, డీజిల్ ధర రూ.99.51 కానుంది.