కారు, బైక్ లేదా ఏదైనా వాహనానికి పెట్రోల్ వేయించడానికి.. తరచూ బంక్ కి వెళ్తుంటారు. అయితే పెట్రోల్ బంక్ ముందు డిస్ ప్లే బోర్డును మీరు గమనిస్తే అక్కడ అనేక రకాల పెట్రోల్ అందుబాటులో ఉంటాయి. వీటికి వేరు వేరు పేర్లు ఉంటాయి.. వాటి రేట్లు కూడా మారుతూ ఉంటాయి. ధరలు వేరు కాబట్టి ఆ పెట్రోల్ లో కూడా కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ పెట్రోల్ లో తేడా ఏంటన్నది చాలా మందికి తెలియదు. ఈ గందరగోళాన్ని క్లియర్ చేయడానికి ఈ కథనాన్ని చదవండి.
పవర్ పెట్రోల్ ను వివిధ పేర్లతో పిలుస్తారు. అందువల్ల పెట్రోల్ పంపు వద్ద మీరు గందరగోళాన్ని ఎదుర్కొనకుండా ఉండటానికి ఈ పెట్రోల్ల పేర్లను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పవర్ అని మాత్రమే కాకుండా.. ఎక్స్ ట్రా మైలేజ్, స్పీడ్, హై స్పీడ్ అని కూడా పిలుస్తారు. కాబట్టి పెట్రోల్ బంకుపై ఈ పేర్లలో ఏవైనా రాసి ఉంటే అయోమయానికి గురికాకుండా మీకు కావాల్సిన పెట్రోల్ పేరు చెప్పండి.
పెట్రోల్-పవర్ పెట్రోల్:
పవర్ పెట్రోల్-పెట్రోల్ మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి పవర్ పెట్రోల్ అధిక మొత్తంలో ఆక్టేన్ కలిగి ఉంటుంది. సాధారణ పెట్రోల్ లో ఆక్టేన్ రేటింగ్ 87 వరకు, పవర్ పెట్రోల్ లో ఆక్టేన్ రేటింగ్ 91 నుంచి 94 వరకు ఉంటుంది. అధిక ఆక్టేన్ కలిగిన పెట్రోల్ ఇంజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది డిటోనేట్ చేయడం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంజిన్ నుంచి వచ్చే శబ్దం, సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది. ఆక్టేన్ యొక్క ప్రయోజనం ఏమిటంటే.. దీని సహాయంతో ఇంజిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.
ప్రీమియం అకా పవర్ పెట్రోల్ ఇకా ఎక్కువ ఖరీదైనది. కానీ ఇది అనేక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పెట్రోల్ ను కారులో వేయడం వల్ల కారు మైలేజ్ పెరుగుతుంది. మైలేజీని పెంచడంతో పాటు, ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో మెరుగైన కోల్డ్ స్టార్ట్ పనితీరు వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం. నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆదారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)