Diwali Firecracker Insurance: దీపావళి వచ్చేస్తోంది. అందరూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ అందించేందుకు ఫోన్ పే అదిరిపోయే ఫీచర్ ప్రకటించింది. కేవలం 11 రూపాయలతో ఈ బీమా సదుపాయం అందుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
దీపావళి అంటే బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకునే ఉత్సవం. బాణాసంచా కాల్చే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగి గాయాలైతే ఆనందం కాస్తా విషాదంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భద్రత అనేది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల్ని ఆదుకునేందుకు ఫోన్ పే సంస్థ సరికొత్త ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్. కేవలం 11 రూపాయలు చెల్లిస్తే చాలు ఈ బీమా సదుపాయం పొందవచ్చు. కేవలం 11 రూపాయలు చెల్లించడం ద్వారా గరిష్టంగా 25 వేల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. ఇది 11 రోజులు అమల్లో ఉంటుంది. అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే. ఈ ప్లాన్‌లో పాలసీ తీసుకున్న వ్యక్తితో పాటు జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజ్ వర్తిస్తుంది. అక్టోబర్ 12 తరువాత కొనుగోలు చేసిన పాలసీలకు 11రోజుల వరకు చెల్లుబాటయ్యేలా ఉంటుంది.
ఫోన్ పే ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవచ్చు
ఫోన్ పేలో ఈ బీమా పొందడం క్షణాల్లో జరిగే ప్రక్రియ. ముందుగా ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి అందులో కన్పించే ఇన్సూరెన్స్ సెక్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకుని 11 రూపాయల ప్రీమియం కలిగిన ప్లాన్ తీసుకోవాలి. పే బటన్ క్లిక్ చేయడం ద్వారా 11 రూపాయలు చెల్లిస్తే పాలసీ అందుతుంది. ఈ ఇన్సూరెన్స్ సహాయంతో అందరూ ఎలాంటి భయం లేకుండా దీపావళి ఉత్సవాలను ఘనంగా, ఆనందంగా జరుపుకోవచ్చు.
24 గంటల్లోపయితే డే కేర్ చికిత్స ఖర్చులు, 24 గంటలు దాటి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే 25 వేలలోపు ఖర్చు కవర్ అవుతుంది. దురదృష్టవశాత్తూ మరణం సంభవిస్తే మాత్రం పరిహారం 25 వేల రూపాయలు అందుతుంది.


