సమాజ్ వాది పార్టీ సరికొత్త డిమాండ్ ను సడన్ గా తెరపైకి తెచ్చింది. నిన్న ఇండి బ్లాక్ కీలక మీటింగ్ సాగగా ఈరోజు సమాజ్ వాది పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ అధినేతను ప్రధానిని చేయాలంటూ నినాదాలతో ఢిల్లీలో హోరెత్తిస్తున్నారు.
- Advertisement -
ప్రధాని అంటే అఖిలేష్ యాదవ్ లా ఉండాలని, తదుపరి ప్రధానిగా అఖిలేష్ కు ఛాన్స్ ఇవ్వాలని ఆయన అనుచరులు చెబుతుండటం మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లు సాధించి తమ సత్తా చాటుకుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమిలో సమాజ్ వాది పార్టీ భాగస్వామ్యపార్టీగా ఉంది.