Homeనేషనల్PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

Farmers: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇవ్వాల్సిన 21వ విడత నిధులు విడుదలకు రంగం సిద్ధమైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

- Advertisement -

20 విడతలు దాటిన ప్రయాణం
2019 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం ద్వారా ఇప్పటివరకు 20 విడతలు నిధులు మంజూరయ్యాయి. ఈ 20 విడతలలో భాగంగా, దాదాపు రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఈ నిధులు కేవలం డిజిటల్ ఫిన్‌టెక్ టెక్నాలజీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు చేరుకోవడం ఈ పథకం యొక్క పారదర్శకతకు నిదర్శనం.

రైతుల ఖాతాకు రూ. 6,000 ఎలా అందుతాయి?
పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ. 6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా… ప్రతి విడతలో రూ. 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ 21వ విడతలో కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ. 2,000 అందనున్నాయి.

నవంబర్ 19న విడుదల
సాధారణంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి నిధులు విడుదల అవుతున్నప్పటికీ, ఇటీవల వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్ వంటి రాష్ట్రాలలో 21వ విడత నిధులను ఇప్పటికే విడుదల చేశారు. మిగిలిన ప్రాంతాలలోని రైతులందరికీ నవంబర్ 19వ తేదీన నిధులు మంజూరు అవుతాయని సమాచారం.

అర్హత నియమాలు: ఈకేవైసీ తప్పనిసరి
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో పూర్తి చేయవచ్చు.

ఆధార్ లింకింగ్: పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంకు ఖాతా ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఒక కుటుంబంలో (భార్యాభర్తలతో సహా) కేవలం ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే, రూ. 10,000కు పైగా పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా అనర్హులుగా పరిగణించబడతారు.

రైతులు తమ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు pmkisan.in అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. నిధులు జమ అయినప్పుడు అలర్ట్ మెసేజ్ రావడానికి, రైతులు తమ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడంతో పాటు, బ్యాంకుకు వెళ్లి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News