Saturday, November 15, 2025
HomeTop StoriesDelhi Bomb Blast: పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: కేంద్ర హోం మంత్రి...

Delhi Bomb Blast: పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Modi and Amit shah inquires about Delhi Bomb Blast: ఢిల్లీలో పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. హ్యుందాయ్‌ i20 కారులో భారీ పేలుడు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అంతకుముందుగా పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమిత్‌ షాకు మోదీ ఫోన్‌ చేసి ఆరా తీశారు. మరోవైపు ఘటన వివరాలను అమిత్‌ షాకు ఢిల్లీ సీపీ వివరించారు. అనంతరం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/delhi-bomb-blast-dead-bodies-visuals/

‘ఎర్రకోట ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద హ్యుందాయ్‌ i20 కారులో పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే అన్ని బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్రైమ్‌ బ్రాంచ్‌, ఎన్‌ఐఏ బృందాలను రంగంలోకి దించాం. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను.’ అని అమిత్‌షా పేర్కొన్నారు. అనంతరం ఆయన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. 

 

అంతకుముందుగా పేలుడు ఘటనకు సంబంధించి నగర పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ కీలక విషయాలను వెల్లడించారు. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో నిదానంగా వచ్చిన కారు రెడ్‌ లైట్‌ వద్ద ఆగిందని.. వెంటనే ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించిందని సీపీ తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఘటనలో 8 మంది మృతి చెందగా.. 24 మందికి పైగా గాయాలయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీపీ వెల్లడించారు. 

Also Read: https://teluguprabha.net/national-news/bomb-blast-in-car-at-red-fort-delhi-8-members-died/

పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఎర్రకోట, చాందినీ చౌక్‌ వైపు వెళ్లే రహదారులన్నీ మూసివేశారు. ఆ ప్రాంతంలో జనాలను ఖాళీ చేయించారు. మంగళవారం చాందినీ చౌక్‌ మార్కెట్‌ పూర్తిగా మూసివేస్తున్నట్లు మార్కెట్‌ అసోసియేషన్ తెలిపింది. కాగా, ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad