Bengal, Tamil Nadu assembly elections: పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఓటు వేయడం అనేది కేవలం హక్కు మాత్రమే కాదు.. దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు.
యువత, మహిళలకు ప్రత్యేక విజ్ఞప్తి: ఈ ఎన్నికల్లో యువతతో పాటు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని మోదీ కోరారు. ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న యువత.. ‘నవ భారత’ నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని కోరారు. మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ఎక్స్ వేదికగా కోరారు.
Also read-Elections: బెంగాల్, తమిళనాడులో ప్రారంభమైన పోలింగ్.. డ్రోన్ల నిఘాలో ఈసీ పర్యవేక్షణ!
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతగా 152 స్థానాలకు, తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

