Friday, September 20, 2024
Homeనేషనల్PM Modi : క్యూ లైన్‌లో నిల్చొని ఓటేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi : క్యూ లైన్‌లో నిల్చొని ఓటేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సోమ‌వారం ఉద‌యం గుజ‌రాత్ అసెంబ్లీ రెండో ద‌శ పోలింగ్ ప్రారంభ‌మైంది. అహ్మ‌దాబాద్‌లోని రాణిప్‌లో గ‌ల పోలింగ్ కేంద్రంలో ప్ర‌ధాని మోదీ ఓటు వేశారు.

- Advertisement -

ఓటు వేసేందుకు ప్ర‌ధాని ఈ ఉద‌యం గాంధీన‌గ‌ర్ రాజ్‌భ‌వ‌న్ నుంచి అహ్మ‌దాబాద్ కు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో త‌న కాన్వాయ్ ను ఆపి రాణిప్‌లోని నిషాన్ ప‌బ్లిక్ స్కూల్‌కు వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లారు. ప్ర‌ధాని ని చూసేందుకు వంద‌ల మంది వ‌చ్చారు. వారికి ఆయ‌న అభివంద‌నం చేస్తూ ముందుకు సాగారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అనంత‌రం సామాన్య ప్ర‌జ‌ల‌తో క‌లిసి క్యూ లైన్‌లో నిల్చొని త‌న వంతు వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉండి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అంత‌క‌ముందు ట్విట్టర్‌లో.. “ప్రజాస్వామ్యం పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు నా అభినందనలు. అలాగే.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా నా అభినందనలు” అని ప్రధాని ట్వీట్ చేశారు.

రెండో విడుత‌లో భాగంగా 14 జిల్లాల్లో 93 నియోజ‌క‌వ‌ర్గాల్లో నేడు పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. 833 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల విషయానికొస్తే 764 మంది పురుష అభ్యర్థులు ఉండగా 69 మంది మహిళా అభ్యర్థులున్నారు. వీరిలో 285 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News