Modi casts vote in Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి వేటును వేశారు. పార్లమెంట్ హౌస్‌లోని వసుధ ఎఫ్ 101లో పోలింగ్ నేటి ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్..సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. విజేత ఎవరో ఈ సాయంత్రం తెలిసిపోతుంది.
కాగా ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి క్యాండిడేట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు ధీమాతో ఉన్నారు.
ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతోపాటు ఈ సభలకు నామినేట్ అయిన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంది. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శీరోమణి అకాలీదళ్ పార్టీలు దూరంగా ఉన్నాయి.
క్రాస్ ఓటింగ్ భయం
కాగా ఈ ఎన్నికలోనూ క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతుంది. గతంలో బీజేపీ అభ్యర్థిగా జగ్దీప్ ధన్‌ఖడ్ పోటీ చేసిన సమయంలో 2022లో ఇతర పార్టీలకు చెందిన వారు ఓటు వేశారు. ఈసారి ఎన్డీయేకు రాజ్యసభ, లోక్‌సభలో మొత్తం 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్సార్సీపీ ఎన్డీయే మద్దతు ప్రకటించింది. కాగా గెలుపును ఖరారు చేసిన మ్యాజిక్ ఫిగర్ 386 మార్కును ఎన్డీయే ఈజీగా దాటేసింది. అయితే ఫలితం వెలువడేదాకా ఆ సంగతి బయటపడదు. ఎందుకంటే ఎవరైన క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే ఎన్డీయేకు కష్టమే. ఈ ఎన్నికలో పార్టీలు విప్ జారీ చేయలేదు. దీంతో క్రాస్ ఓటింగ్‌పై ఇండియా కూటమి బాగా ఆశలుపెట్టుకుంది.
ఇండియా కూటమికి 315 సభ్యుల బలం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయవచ్చన్న ఆశాభావం కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ మెంబర్ స్వాతి మాలివాల్ ఆప్ కు దూరంగా ఉన్నారు. ఒకవేళ మాలివాల్ ఓటు వేసిన ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపును అడ్డుకోలేరని కూటమి సభ్యులు పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విధానంపై ఎన్డీయే, ఇండియా కూటమి ఓటర్లయిన పార్లమెంటు సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
గెలుపు లాంఛనమే
ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు భిన్నంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియలో భాగం కారు. అయితే, ప్రస్తుతం లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. ఈ 782 సభ్యుల్లో మెజార్టీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారే ఉపరాష్ట్రపతి అవుతారు.


