HomeTop StoriesPM Modi: ఈ పన్నెండేళ్లలో ఎన్నో సాధించాం..! మేం వచ్చాకే ప్రజల్లో నమ్మకం పెరిగింది..!...

PM Modi: ఈ పన్నెండేళ్లలో ఎన్నో సాధించాం..! మేం వచ్చాకే ప్రజల్లో నమ్మకం పెరిగింది..! ప్రధాని మోదీ వ్యాఖ్యలు

PM Modi Comment on NDA Government Vision: కాంగ్రెస్‌ హయాంలో దేశంలో అనేక సమస్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం చూపి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల్లో భారీగా నమ్మకం పెరిగిందన్న ఆయన.. దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ కాలం ప్రధానిగా ఉండే అవకాశం ఇచ్చిన దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్ని మిత్రపక్షాలకు ఈ విజయం దక్కుతుందన్న ఆయన.. దేశ రాజకీయాల్లో నేడు చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు.

- Advertisement -

Also read: CM Chandrababu: అమరావతిలో కీలక ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీ..

‘‘కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. అభివృద్ధి రేటు దారుణంగా ఉండేది. మేం వచ్చాక రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇంటర్నెట్‌ వాడేవాళ్ల సంఖ్య 25 కోట్ల నుంచి వంద కోట్లకు పెంచాం. భారత్‌లో డిజిటల్‌ విప్లవం తీసుకొచ్చాం. 2014కు ముందు, ఇప్పుడు దేశం ఉందో ప్రజలు గమనించాలి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను మార్పులను ప్రజలు బేరీజు వేసుకోవాలి. కేవలం 12 ఏళ్లలోనే ఇన్ని మార్పులు తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు కూడా ఆమోదించారు.’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Also read: Medical Posts: గుడ్‌న్యూస్‌.. మెడికల్‌ కాలేజీల్లో 433 పోస్టుల భర్తీ పూర్తి.. ఫైనల్‌ లిస్ట్ రిలీజ్..!

యావత్ ప్రపంచం మన వైపు చూస్తోంది..

”గతంలో 370 ఆర్టికల్‌ అంటేనే భయపడేవారు. మేం దాన్ని రద్దు చేసి కశ్మీర్‌ ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం. గతంలో ఉగ్రవాదం పేరు చెబితేనే భయపడేవారు. మేం వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాం. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. ‘వికసిత్‌ భారత్‌ 2047’ ను సాధించే దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మన దేశం వైపు చూస్తున్నాయి. ఇది ఎన్డీఏ సాధించిన విజయం.’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీతో సహా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News