Homeనేషనల్Amit Shah: 'ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన దేశ విభజన'

Amit Shah: ‘ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన దేశ విభజన’

న్యూఢిల్లీ (తెలుగుప్రభ): దేశ విభజన నాటి దారుణ కాళరాత్రిని, లక్షలాది కుటుంబాలు ఎదుర్కొన్న ఆవేదన , ఆస్తిపాస్తుల నష్టాలను స్మరించుకుంటూ జరుపుకునే ‘దేశ విభజన విషాద స్మారక దినం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు నివాళులర్పించారు. 1947 నాటి ఘోర విభజన ఎందరో జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందని, బంధువులను కోల్పోయి, సర్వస్వం వదులుకుని అనాథలుగా మారినప్పటికీ, శూన్యం నుంచి జీవితాలను పునర్నిర్మించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములైన పూర్వీకుల ధైర్యం, మానవ సంకల్ప బలానికి ప్రతీక అని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ రోజు దేశంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి. ‘వికసిత భారత్’ నిర్మాణానికి పునరంకితం కావడానికి స్ఫూర్తినిస్తుందని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. 1947 ఆగస్టు 14 చరిత్రలోనే అత్యంత హృదయవిదారకమైన అధ్యాయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్ల దేశంపై పడిన ఈ విభజన మచ్చను చరిత్ర ఎప్పటికీ మరచిపోలేదని విమర్శించారు. అప్పటి ఘోరకలిలో ప్రాణాలు కోల్పోయిన నిర్దోషులకు నివాళులర్పించిన ఆయన, దేశాన్ని మళ్లీ విభజించాలని చూసే శక్తులు ఏమాత్రం విజయం సాధించకుండా, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ లక్ష్యాన్ని సాధించడానికే మోడీ ప్రభుత్వం యువతకు ఈ చరిత్రను గుర్తుచేస్తోందని తెలిపారు. విభజన అనేది కేవలం సరిహద్దుల విడదీత మాత్రమే కాదని, కోట్ల కుటుంబాల భావోద్వేగాలు, బంధాలు తెగిపడిన విషాదమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 1947 నాటి సామూహిక వలసలు, మానవ హక్కుల ఉల్లంఘనలను స్మరించుకుంటూ ఏటా ఆగస్టు 14న ఈ దినాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News