ఉగ్రవాదులకు ఊహించని విధంగా కఠిన శిక్షలు విధిస్తామని ప్రధాని మోదీ(PM Modi) హెచ్చరించారు. ఈ ఉగ్రదాడి తర్వాత తొలిసారి బీహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఘటనతో దేశమంతా దు:ఖంలో మునిగిపోయిందన్నారు. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది మహిళలు తమ భర్తలను కోల్పోతే.. పిల్లలు తండ్రులను కోల్పోయారని తెలిపారు. వారందరికీ దేశమంతా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉగ్రవాదాన్ని తుది ముట్టించే సమయం ఆసన్నమైందన్నారు. ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నామని వారికి సహకరించిన వారిని కూడా వదిలిపెట్టమని హెచ్చరికలు చేశారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు.. భారత్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందిన సగంతి తెలిసిందే.