Homeనేషనల్Modi: ''నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్'' కి శ్రీకారం

Modi: ”నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్” కి శ్రీకారం

Nasha Mukt Yuva: భారతదేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెఎన్స్‌ ద్వారా నషా ముక్త్ యువ ఫర్‌ వికసిత్ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా 100 వారాల పాటు కొనసాగే ‘జన్ భాగిదారి’ ప్రచార కార్యక్రమం మొదలైంది. దేశంలోని 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువజన క్లబ్‌లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యువ విభాగాలు, భాగస్వాములయ్యాయి.

Also Read: https://teluguprabha.net/national-news/modi-forgiveness-statement-sparks-debate-over-student-cases/

ఈ ప్రచారం ద్వారా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడమే కాకుండా, తమ సమాజంలో సానుకూల మార్పుకు రాయబారులుగా మారేలా ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, ‘విక్సిత్ భారత్’ సాధనలో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News