Sunday, March 30, 2025
Homeనేషనల్PM Modi: బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌కు ప్రధాని మోదీ లేఖ

PM Modi: బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్‌కు ప్రధాని మోదీ లేఖ

బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని బుధవారం జరుపుకుంది. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus)కు భారత ప్రధాని మోదీ (PM Modi) లేఖ రాశారు.

- Advertisement -

‘బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మీకు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. బంగ్లా విముక్తి యుద్ధం మన సంబంధాలకు మార్గదర్శక కాంతిగా కొనసాగుతోంది. ఇది బహువిధాలుగా అభివృద్ధి చెందింది. శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరు దేశాల ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగా రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పాలనలో హిందువులు, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది ఆస్తులు కోల్పోయారు. ఈ దాడులపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య బంధాలు బలహీనపడ్డాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News