టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారక రామారావు(NTR) 102వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) నివాళి అర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -
“తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు.. దార్శనికత ఉన్న నాయకుడు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలచుకుంటూనే ఉంటున్నారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారు. ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.