Saturday, April 19, 2025
Homeనేషనల్PM Modi: ఎలాన్ మ‌స్క్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌ కాల్.. ఎందుకంటే..?

PM Modi: ఎలాన్ మ‌స్క్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌ కాల్.. ఎందుకంటే..?

సుంకాల విష‌యంలో భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం కొన‌సాగుతున్న వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మ‌స్క్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) ఫోన్‌ చేశారు. ఆయనతో పలు అంశాలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు.

- Advertisement -

మ‌స్క్‌తో ప‌లు అంశాలపై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన విష‌యాలు త‌మ మ‌ధ్య‌ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని చెప్పుకొచ్చారు. ఈ రంగాల‌లో భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత పురోగ‌మిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News