Sunday, February 8, 2026
Homeనేషనల్PM Modi: పవన్ కల్యాణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు: 'కెంజుట్సు'లో అరుదైన గౌరవం!

PM Modi: పవన్ కల్యాణ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు: ‘కెంజుట్సు’లో అరుదైన గౌరవం!

PM Modi Praises Pawan Kalyan: జపనీస్ యుద్ధకళల్లో అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, అంకితభావానికి దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

- Advertisement -

కెంజుట్సులో అరుదైన ప్రవేశం
ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’ (Kenjutsu) లో పవన్ కల్యాణ్‌కు ఇటీవల అధికారిక ప్రవేశం లభించింది. జపాన్ వెలుపల ఈ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయుల్లో పవన్ ఒకరు కావడం విశేషం. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆయన చేస్తున్న నిరంతర పరిశోధనలు, క్రమశిక్షణతో కూడిన సాధనను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది.

Also Read:Anantapur SP- అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెన్షన్

ప్రధాని మోదీ ప్రశంసలు
పవన్ సాధించిన విజయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో మీ విజయం యువతరానికి స్ఫూర్తిదాయకం. దశాబ్దాల పాటు మీరు కొనసాగించిన పట్టుదల మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాలకు మీ వంటి వారి కృషి ఎంతో అవసరం” అని కొనియాడారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News