Sunday, November 16, 2025
Homeనేషనల్Tamilnadu: గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ

Tamilnadu: గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన అనంతరం తమిళనాడు పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ వస్త్రాలంకరణతో ఆలయంలోకి ప్రవేశించిన ప్రధానిని ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసారు. మహాశివుడికి గంగాజలంతో అభిషేకం చేసారు. తీర్థ ప్రసాదాలని స్వీకరించిన అనంతరం ఆది తిరువత్తరై ఉత్సవాలల్లో ప్రధాని పాల్గొన్నారు.

- Advertisement -

తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ తిరుచిరాపల్లి జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానికి బీజేపీ కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది. గంగైకొండ చోళపురం ఆలయానికి వస్తున్న మార్గంలో ప్రజలు రోడ్ కు ఇరువైపులా నిల్చుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు.

Readmore: https://teluguprabha.net/national-news/mother-leaves-son-at-nalgonda-bus-stand/

చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా తమిళనాడులో ఆది తిరువత్తరై ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశ గొప్ప చక్రవర్తులలో ఒకరైన మొదటి రాజేంద్ర చోళుడి గౌరవార్థం ప్రధాని మోదీ ఒక స్మారక నాణాన్ని విడుదల చేశారు. దీని తర్వాత ఇళయరాజా సంగీత ప్రదర్శన నిర్వహించారు.

Readmore: https://teluguprabha.net/national-news/child-kills-snake-with-bite/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad