మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మహారాష్ట్ర ధూలే లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… బ్రేకులు, చక్రాలు లేని బండిలో డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అ’ఘాడీ’ నేతలు గొడవపడుతున్నారని సెటైర్లు వేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష కూటమిలో సీఎం ఎవరవుతారనే అంశంపై అంతర్గత యుద్ధం జరుగుతోందని విమర్శించారు.
Also Read : ‘ఇది ట్రైలర్ మాత్రమే’.. రేవంత్ ఆన్ ఫైర్
మహాయుతి అధికారంలో కొనసాగితేనే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సూచించారు. కానీ అభివృద్ధి జరగకుండా ప్రజల నుంచి దోచుకునేందుకు కొందరు నేతలు రాజకీయాల్లో ఉంటారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మాత్రమే రాష్ట్రంలో మంచి పాలనను అందించగలదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారని కొనియాడారు. ప్రజల్లో విష బీజాలు నాటి దేశంలో ఉన్న గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఐక్యంగా ఉన్నంతకాలం ఏ శక్తీ వారిని అడ్డుకోలేదని పీఎం మోదీ వెల్లడించారు.