Saturday, November 15, 2025
Homeనేషనల్Pm Modi Assam Visit: విదేశీ వస్తువులైనా భారత్‌లో తయారైతేనే కొనండి- ప్రధాని మోదీ

Pm Modi Assam Visit: విదేశీ వస్తువులైనా భారత్‌లో తయారైతేనే కొనండి- ప్రధాని మోదీ

Pm Modi Assam Visit: ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దరంగ్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా, ఈ ఏడాది పండుగ సీజన్‌ను స్వదేశీ వస్తువులతో చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా.. భారత్‌లో తయారైన వస్తువులను మాత్రమే కొనాలన్నారు. 

- Advertisement -

1962లో జవహర్‌లాల్ నెహ్రూ పాలనలో చైనా దురాక్రమణ వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదని ప్రధాని మోదీ విమర్శించారు.కాంగ్రెస్ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలుస్తోందని మోదీ విమర్శించారు. అయినప్పటికీ తనకు 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ దేశ ప్రయోజనాలను పట్టించుకోలేదని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం కూడా దేశ వ్యతిరేకులు, చొరబాటుదారుల రక్షకుడిగా కాంగ్రెస్ మారిందని ఎద్దేవా చేశారు.

స్వాతంత్ర్యం ఏర్పడ్డాక 6 దశాబ్దాల పాటు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది. అస్సాంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలించింది. ఆ కాలంలో బ్రహ్మపుత్రపై కేవలం 3 వంతెనలు మాత్రమే నిర్మించారు. కానీ ఎన్డీఏ పాలనలో 6 వంతెనలు నిర్మించాం. మీ సమయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఏ ప్రాంతంలోనైనా వేగవంతమైన అభివృద్ధికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈ క్రమంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నా. అస్సాం ప్రజలు ఆశీర్వదించాలి.’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/i-am-shivas-devotee-will-swallow-poison-pm-modis-emotional-counter-attack-on-abuse-row/

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలోని దరాంగ్ జిల్లాలో పర్యటించారు. రూ. 5 వేల కోట్ల నిధులతో చేపట్టిన బయో-ఇథనాల్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభించారు. పాలీ ప్రొఫైలిన్ ప్లాంట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రాష్ట్రానికి రూ.18,530 కోట్ల విలువైన ప్రాజెక్టులను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని కామాఖ్య దేవి ఆశీర్వాదంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని వివరించారు.

Also Read: https://teluguprabha.net/national-news/tejashwi-yadav-announces-rjd-to-contest-all-assembly-seats/

వచ్చే 25-50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని సిద్ధం చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 2047లో 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. నవరాత్రి మొదటి రోజున జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయని మోదీ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆరోగ్యం, బీమా వంటి సేవలు చౌకగా అందుతాయని వివరించారు. యువతకు అభివృద్ధి చెందిన భారత్ కల మాత్రమే కాక సంకల్పమని, ఈశాన్య ప్రాంతం అందులో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad