భారత ప్రధాని మోదీ (PM Modi) వచ్చే నెలలో శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ మొదటి వారంలో మోదీ ఆయా దేశాలకు వెళ్లనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో ఆయా దేశాలతో దౌత్యసంబంధాలపై ప్రధానంగా చర్చించనట్లు సమాచారం. ఇక మే 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు మోదీ విదేశీ పర్యటన ఖర్చు రూ.258 కోట్లు అయినట్లు పలు కథనాలు వెల్లువడిన సంగతి తెలిసిందే.
- Advertisement -
ఇదిలా ఉంటే ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా కొత్తగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.