Saturday, November 15, 2025
HomeTop StoriesPM Modi: 'మాట ఇస్తున్నా.. దిల్లీ పేలుడు బాధ్యులను వదిలిపెట్టను'

PM Modi: ‘మాట ఇస్తున్నా.. దిల్లీ పేలుడు బాధ్యులను వదిలిపెట్టను’

PM Modi Sensational comments on delhi Bomb blast: దిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుడుకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనపై దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ముమ్మరం దర్యాప్తును కొనసాగిస్తున్నాయని అన్నారు. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని మోదీ తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని అన్నారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

- Advertisement -

బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా: భూటాన్ రాజధాని థింఫు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దీల్లీ పేలుడు ఘటనపై స్పందించారు. తాను ఈ రోజు చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చానని మోదీ అన్నారు. సోమవారం సాయంత్రం దిల్లీలో జరిగిన భయంకరమైన ఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టిందని తెలిపారు. బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. దేశం మొత్తం వారికి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టే ప్రస్తక్తే లేదని మోదీ హెచ్చరించారు.

Also Read:https://teluguprabha.net/national-news/delhi-blast-death-toll-rises-amit-shah-meeting/

రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం భారత ప్రధాని మోదీ భూటాన్‌ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని కింగ్ వాంగ్చుక్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య గల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇరుదేశాల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1020 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును మోదీ, ఆదేశ ప్రధానితో సంయుక్తంగా ప్రారంభించనున్నారు. అలాగే భూటాన్ నాల్గవ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జయంతి వేడుకలకు సైతం ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad