Friday, February 13, 2026
Homeనేషనల్Somnath Temple : సోమనాథంలో మోదీ 'శౌర్య యాత్ర'.. వెయ్యేళ్ల గాయానికి స్వాభిమాన పర్వం!

Somnath Temple : సోమనాథంలో మోదీ ‘శౌర్య యాత్ర’.. వెయ్యేళ్ల గాయానికి స్వాభిమాన పర్వం!

PM Modi Somnath Temple visit : చరిత్ర గాయాలు, ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, జాతీయ స్వాభిమానం.. ఈ మూడు భావనల సంగమంగా గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం ఓ అపూర్వ ఘట్టానికి వేదిక కానుంది. వెయ్యేళ్ల క్రితం విదేశీ దాడికోరుల చేతిలో విధ్వంసానికి గురైన ఆ మహాక్షేత్రంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ‘శౌర్య యాత్ర’కు సారథ్యం వహించనున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఏమిటీ ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’? ప్రధాని చేపట్టనున్న ‘శౌర్య యాత్ర’ వెనుక ఉన్న ఆంతర్యమేంటి?

- Advertisement -

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సోమనాథ ఆలయంలో, గురువారం జనవరి 8, 2026 నుంచి నాలుగు రోజుల పాటు ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1026లో మహమ్మద్ గజనీ ఈ ఆలయంపై జరిపిన తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆనాటి విధ్వంసాన్ని, ఆ తర్వాత జాతి ప్రదర్శించిన అద్వితీయమైన పునరుజ్జీవన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

ప్రధాని పర్యటన.. శౌర్య యాత్ర : ఈ వేడుకలలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు.  తన పర్యటనలో భాగంగా, జనవరి 11న ప్రధాని మోదీ సోమనాథ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

108 అశ్వాలతో ‘శౌర్య యాత్ర’: అనంతరం, ఆలయం వద్ద జరిగే ‘శౌర్య యాత్ర’కు ప్రధాని నాయకత్వం వహిస్తారు. 108 అశ్వాలతో, కిలోమీటరు పొడవునా సాగే ఈ యాత్ర, ఆనాటి చారిత్రక గాయాలపై, నేటి జాతి స్వాభిమాన విజయానికి ప్రతీకగా నిలవనుంది.

చరిత్రను స్మరించుకున్న ప్రధాని : ఈ సందర్భంగా, ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’ వేదికగా సోమనాథంతో తనకున్న అనుబంధాన్ని, ఆలయ చారిత్రక ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు.

1026 నాటి దాడి, ఆ తర్వాత జరిగిన అనేక దండయాత్రలు, మన ఆధ్యాత్మిక సంకల్పాన్ని ఏమాత్రం బలహీనపరచలేకపోయాయి. పైగా, ఆ దాడులే మన సాంస్కృతిక ఐక్యతను మరింత పటిష్ఠం చేశాయి. ఆలయం పదేపదే పునర్నిర్మించబడటమే దీనికి నిదర్శనం.”
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ వేడుకలు, కేవలం ఒక ఆలయానికి సంబంధించినవి కాదని, విదేశీ దాడులను, విధ్వంసాలను తట్టుకుని, ఫీనిక్స్ పక్షిలా నిలబడిన భారతీయ సంస్కృతి, విశ్వాసాల అచంచలమైన స్ఫూర్తికి నివాళి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News