Tuesday, May 13, 2025
Homeనేషనల్PM Modi: పాక్ నట్టింట్లోకి వెళ్లి మట్టిలో కలిపేశాం: ప్రధాని మోదీ

PM Modi: పాక్ నట్టింట్లోకి వెళ్లి మట్టిలో కలిపేశాం: ప్రధాని మోదీ

భారత మహిళల సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించిన మోదీ సిబ్బందితో ముచ్చటించారు. సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

- Advertisement -

”ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని సైన్యం శపథం చేసింది. మళ్లీ కవ్విస్తే పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే సమాధానం చెబుతాం. జవాన్ల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. ఇది నవ భారతం. మానవత్వంపై దాడి చేస్తే శత్రువును మట్టిలో కలిపేస్తాం. ధైర్య సాహసాలను చూపిన సైన్యానికి సెల్యూట్. మన సైన్యం పరాక్రమం భారత సామర్థ్యానికి ప్రతిరూపం. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు భయపడేది లేదు. ఉగ్రవాదులను, వారికి సహకరించే వారిని వేర్వేరుగా చూడబోము. భారత్ శక్తి సామర్థ్యాలను చూసినందుకు నా జీవితం ధన్యమైంది.

భారత్ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణి సంగమం. ఎయిర్ ఫోర్స్ భారతదేశాన్ని గర్వించేలా చేసింది. మన ఎయిర్ డిఫెన్స్ ముందు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లు, యూఏవీలు ఫెయిల్ అయ్యాయి. మన సైన్యం కొట్టిన దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయి. ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలిచారు. భారత్ మాతాకీ జై నినాదంతో శత్రువులో వణుకు పుట్టింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం, మన విధానం. మన అక్కా చెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం” అని మోదీ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News