తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రామ నవమి సందర్భంగా, ఏప్రిల్ 6న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
బ్రిటీష్ కాలంలో నిర్మితమైన పాత పంబన్ బ్రిడ్జి స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఆధునిక రైల్వే వంతెనను నిర్మించింది. సుమారు ₹535 కోట్ల వ్యయంతో, 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ప్రత్యేకతగా, ఈ బ్రిడ్జిలో వర్టికల్ లిఫ్ట్ మెకానిజం అమర్చారు, దీని ద్వారా ఓడలు, పడవలు గుండా వెళ్లే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు, బ్రిడ్జి మధ్య భాగం పైకి లేచేలా రూపొందించారు.
ఈ ఆధునిక నిర్మాణ శైలితో, పంబన్ బ్రిడ్జి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. రామేశ్వరం-తాంబరం రైల్వే మార్గానికి ఇది మరింత సులభతరం చేయనుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రామేశ్వరంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.