Saturday, November 15, 2025
Homeనేషనల్Modi Tour In Three States: మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన

Modi Tour In Three States: మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన

Pm Modi Tour In Bihar: ప్రధాని మోడీ శుక్ర, శనివారాల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బిహార్‌లో రూ.5736 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మోడీ ఒడిశాలో పర్యటించనున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఈనెల 21న వైజాగ్‌లో పర్యటించనున్నారు.

బహిరంగ సభలో మోడీ ఆపరేషన్ సింధూర్‌పై ప్రసంగించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు పర్యాకులపై జరిపిన కాల్పుల్లో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బదులుగా భారత సైన్యం పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ప్రతీకారం తీసుకున్న భారత్‌కు అన్ని దేశాలు మద్దతు తెలిపాయి. దేశంలో ప్రతి పౌరుడు ఆపరేషన్ సింధూర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/sonia-gandhi-discharged-form-hospital/
అయితే, భారత్ అన్ని రకాలుగా పాక్‌ను దెబ్బకొట్టడంలో పైచేయి సాధించింది. అటు సింధు జలాలను దిగువకు వదలకుండా భారత్ ఆపివేసింది. రవాణా, వాణిజ్యంపై ఆంక్షలు విధించింది. దీంతో పాక్ అతాలకుతలం అయ్యింది. దిక్కుతోచని స్థితిలో పాక్ ప్రధాని, సైన్యం కాల్పుల విరమణకు దిగివచ్చాయి. బారత్‌తో కాళ్ల బేరానికి దిగిన పాక్ తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఒప్పుకుంది.

ఆపరేషన్ సింధూర్‌పై పలు సభల్లో మోడీ ప్రసంగిస్తూ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ఉగ్రదాడులకు పాల్పడితే తాము తగిన రీతిలో పాక్ బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉగ్రమూకలను పాక్ పెంచి పోషిస్తోందని, ఇక నైనా తన వైఖరి మార్చుకోవాలని ప్రధాని మోడీ హెచ్చరించారు.

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచి ప్రకటనలు చేస్తూ వచ్చాడు. కాల్పుల విరమణకు అంగీకరించకుంటే ఇరు దేశాలకు తాము వాణిజ్య పరంగా సహకరించబోమని స్పష్టం చేశారు. అయితే, భారత విదేశాంగ మంత్రి మాత్రం ఇందులో ట్రంప్ ప్రమేయం లేదని నొక్కిచెప్పారు. తాము కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై మోడీ ట్రంప్‌కు తాజాగా ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ దిగొచ్చి ఆపరేషన్ సింధూర్, భారత్, పాక్ మధ్య సీజ్ ఫైర్‌కు కారణం తాను కాదని వివరించారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన నాయక్ వీరమరణం పొందారు. అతని సేవలను దేశం మరువదని ప్రధాని పేర్కొన్నారు. అధికారిక లాంచనాలతో నాయక్ అంత్యక్రియలను జరిపించారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad