Saturday, November 15, 2025
Homeనేషనల్PM Modi : గుజరాత్ లో రెండు రోజు పాటు ప్రధాని మోదీ పర్యటన .....

PM Modi : గుజరాత్ లో రెండు రోజు పాటు ప్రధాని మోదీ పర్యటన .. రూ. 5,400 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

PM Modi Tour : ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల( ఆగస్టు 24, 25వ తేదీ) పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రూ. 5,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ద్వారా గుజరాత్ అభివృద్ధికి మరింత ఊత ఇవ్వనుంది. ముఖ్యంగా మౌలిక వసతులు, ఇంధనం, పట్టణాభివృద్ధి, రోడ్లు, రైల్వేల రంగాల్లో గణనీయమైన పురోగతి లభిస్తుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని అనేక కీలకమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

- Advertisement -

రైల్వేలకు కొత్త జీవం
ఈ పర్యటనలో భాగంగా, రూ. 1,400 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. ఇందులో మెహ్సానా-పాలన్‌పూర్ రైలు మార్గం డబ్లింగ్, అలాగే కాలోల్-కడి-కటోసన్ రోడ్ రైలు మార్గం గేజ్ మార్పిడి వంటి ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికుల రాకపోకలు సులభతరం కావడంతో పాటు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.

పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత
పట్టణ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, ప్రధాని మోదీ రూ. 1,000 కోట్లకు పైగా విలువైన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అహ్మదాబాద్, మెహ్సానా, గాంధీనగర్‌లలో విద్యుత్ గ్రిడ్‌లను ఆధునికీకరించడం, నష్టాలను తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పాటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద నిర్మించిన కొత్త గృహాలను కూడా ప్రారంభిస్తారు. అహ్మదాబాద్‌లో స్లమ్స్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం
ఈ పర్యటనలో ప్రధాని మోదీ, గుజరాత్ రికార్డు సృష్టిస్తున్న ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. సుజుకి సంస్థ తయారు చేసిన తొలి గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ “e VITARA” ని ఎగుమతి చేయడానికి పచ్చజెండా ఊపుతారు. అలాగే, స్వదేశీ తయారీకి ఊతమిస్తూ, హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ భారీ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయి. ప్రధాని సొంత రాష్ట్ర పర్యటనతో గుజరాత్ ప్రజలకు కొత్త ఉత్సాహం లభించింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad