PM Modi Allegations on Congress: అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని.. ఆ పార్టీకి అవకాశవాదం నైజమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. తమిళనాడులో డీఎంకేతో దశాబ్దాల బంధాన్ని వదిలేసి, ఆ పార్టీని వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. బెంగళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/telangana/pm-narendra-modi-speech-on-central-funds-to-telangana/
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా, స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో చాలా కాలం పాటు డీఎంకేతో పొత్తులో ఉండి, ఇప్పుడు పవర్ కోసం ఆ పార్టీకి కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిధుల దోపిడీ, అంతర్గత కలహాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పుడు పరాన్నజీవిగా మారిందని, రాజకీయంగా మనుగడ సాగించడానికి మరో పార్టీ మద్దతు కోసం ఎదురుచూస్తుందని ఎద్దేవా చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-will-develop-faster-if-modi-has-blessings/
‘కర్ణాటకలో అంతర్గత అధికార పోరాటాల కారణంగా సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ విఫలమైంది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి బదులుగా అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. సీఎం ఎంతకాలం కొనసాగుతారో.. మరో వ్యక్తికి అవకాశం లభిస్తుందో లేదో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకోలేకపోతుంది. సరైన ఎజెండా లేకపోవడంతోనే ఆ పార్టీకి ప్రజల్లో విశ్వాసం పోతోంది. సురక్షిత పాలన, అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అందుకే వెస్ట్ బెంగాల్, అసాం ప్రజలు కాషాయానికి పట్టం కట్టారు. భవిష్యత్తులోనూ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.’- ప్రధాని మోదీ

