PM Modi- Norway: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అత్యున్నత పురస్కారం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతో పటిష్టమైన స్నేహ బంధాన్ని బలోపేతం చేస్తూ ఆ దేశాలకు ప్రియమైన స్నేహితుడిగా నిలిచారు. నిన్న స్వీడన్ నుంచి గౌరవం అందుకున్న మోదీని.. ఈ రోజు ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్’తో నార్వే ప్రభుత్వం సత్కరించింది. సోమవారం ఓస్లోలో నార్వే రాజు నుంచి మోదీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Also Read: https://teluguprabha.net/crime-news/container-hits-wedding-party-in-maharashtra-12-dead/
నార్వే దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. నార్వే ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడంలో మోదీ చూపిన దార్శనిక నాయకత్వానికి, చేసిన విశేష సేవలకు గుర్తింపుగా నార్వే రాజు హెరాల్డ్ V ఈ గౌరవాన్ని అందించారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ అందుకున్న 32వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
గత 43 ఏళ్లలో ఒక భారత ప్రధాని నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అవార్డుతో ప్రధాని మోదీ ఖాతాలో మొత్తం 32 అంతర్జాతీయ పురస్కారాలు చేరాయి. కాగా, ఆదివారం స్వీడన్ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్’ను మోదీ అందుకున్న విషయం తెలిసిందే.
ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు అంకితం చేశారు. ఈ పురస్కారం భారత్- నార్వే దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి నిదర్శనమని సాషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

