PM Modi Netherlands: నెదర్లాండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ‘ది హేగ్’లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను కలిశారు. భారతీయుల స్నేహానికి హేగ్ ఒక నిదర్శనమని కొనియాడారు. నెదర్లాండ్స్ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని హర్షం వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/maharashtra-government-imposes-complete-ban-on-bike-taxis/
కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. ఆ ఎన్నికల్లో NDA ప్రభుత్వం ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. కోట్లాది మంది భారతీయుల విశ్వాసం.. తనను వెనకడుగు వేయనివ్వలేదన్నారు. ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-comments-during-srikakulam-visit/
‘భారత్ పెద్ద పెద్ద కలలు కంటోంది. భారతీయ యువకులు ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టప్‌లు పెడుతున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ మారుతోంది. వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు తీసుకొచ్చాం. ప్రపంచంలోనే అతిపెద్ద AI సమ్మిట్‌ను భారత్ నిర్వహించింది. అందరికంటే ముందే చంద్రుడిపై కూడా మనం అడుగుపెట్టారు. డిజైన్ ఇండియా, మేడిన్ ఇండియాగా మారింది.’- ప్రధాని మోదీ

