Thursday, March 12, 2026
Homeనేషనల్PM RAHAT: పీఎం రాహత్‌కు ఆమోదం.. ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌

PM RAHAT: పీఎం రాహత్‌కు ఆమోదం.. ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌

PM RAHAT Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘పీఎం రాహత్‌’ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. జాప్యం తలెత్తకుండా బాధితులకు సమయానికి వైద్యం అందించేలా ఈ పథకం దోహదపడనుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-thanks-people-for-victory-in-municipal-elections/

ప్రధాని మోదీ నూతన పీఎంఓ కార్యాలయం ‘సేవా తీర్థ్‌’ను ప్రారంభించిన అనంతరం.. పలు పథకాలను ఆయన ఆమోదం తెలిపారు. వాటిలో భాగంగా ‘పీఎం రాహత్’ (PM RAHAT) పథకానికి ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులందరికీ వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రమాదానికి గురైన వారికి గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి గరిష్ఠంగా 7 రోజుల వరకు ఈ ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని కేంద్రం తెలిపింది.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ‘గోల్డెన్ అవర్’లో వెంటనే వైద్యం అందించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పథకాన్ని లాంచ్‌ చేశారు. ‘గోల్డెన్‌ అవర్‌’ ట్రీట్‌మెంట్‌ ద్వారా ప్రాణనష్టాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పీఎం రాహత్‌ రూపుదిద్దుకుంది. ఇక, బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కాపాడే వారికి రూ. 25,000 నగదు పురస్కారం కూడా అందించనున్నారు.

Also Read: https://teluguprabha.net/top-stories/deputy-cm-bhatti-vikramarka-responds-to-the-madhira-municipal-election-results/

పీఎం రాహత్‌ పథకం ప్రకారం.. రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్య సదుపాయం అందించాలి. ఒకవేళ ఆ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేకపోతే రవాణా ఏర్పాటు చేసి మరో ఆస్పత్రికి తరలించాలి. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత చికిత్సకి సంబంధించిన బిల్లులను ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News