Popular singer Arman Sidhu dies in road accident: ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ హర్మాన్ సిద్ధు మాన్సా (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పంజాబ్‌లోని తన సొంత గ్రామం ఖియాలాకు వెళ్తుండగా పాటియాలా హైవేపై ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. నిన్న (శుక్రవారం) అర్థరాత్రి జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధు మాన్సా అక్కడికక్కడే మరణించాడు. సిద్ధు మాన్సా ఆకస్మిక మరణంతో పంజాబ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తన అభిమానులతో పాటు పంజాబీ సంగీత సమాజం అంతటా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సిద్ధు మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/new-revelations-in-delhi-blast-conspiracy/
పంజాబ్‌లో పాపులర్ సింగర్‌గా రాణిస్తున్న సిద్దూ..
పంజాబ్‌లో హర్మాన్ సిద్ధు మాన్సా మంచి ర్యాంప్ ఆల్బమ్స్‌తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇతడి రూరల్ బ్యాక్ గ్రౌండ్ పాటలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. మిస్ పూజాతో కలిసి ‘పేపర్ యా ప్యార్’ అనే బ్రేక్ అవుట్ హిట్‌తో సిద్ధు బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పటికీ పంజాబ్‌లో ఏ శుభకార్యంలోనైనా ఈ పాట తప్పకుండా ప్లే అవ్వాల్సిందేనంటే అతని పాటలకు ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. సింగర్‌గానే కాకుండా గేయ రచయితగా కూడా సిద్ధు తనదైన శైలిలో రాణించారు. కోయి చక్కర్ నాయి, బేబే బాపు, బబ్బర్ షేర్, ముల్తాన్ VS రష్యా వంటి పాటలు అతనికి పంజాబీ సంగీత పరిశ్రమలో మంచి పేరును తెచ్చిపెట్టాయి. తన పాటల్లో కుటుంబ బంధాలను ప్రతిబింబించేలా లేదా సామాజిక ఇతివృత్తాలతో కూడిన మెసేజ్ ఇచ్చేవాడు. గ్రామీణ నేపథ్య పాటలు, కుటుంబ బంధాలను తెలిపే పాటలను తనదైన శైలిలో పాడుతూ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

