Saturday, November 15, 2025
Homeనేషనల్Jason David : పవర్ రేంజర్ నటుడు ఆత్మహత్య

Jason David : పవర్ రేంజర్ నటుడు ఆత్మహత్య

పవర్ రేంజర్.. 90వ దశకంలో వచ్చిన ఈ సిరీస్ లో గ్రీన్ రేంజర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆపై వైట్ రేంజర్ గా ప్రజల ఆదరణ పొందిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ (49) టెక్సాస్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అందుకు గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఆయన మరణ వార్తను వ్యక్తిగత మేనేజర్ జస్టిన్ వెల్లడించారు. కాగా.. తమ అభిమాన గ్రీన్ రేంజర్ మృతిపట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ.. నివాళులు అర్పిస్తున్నారు. అతను కేవలం నటుడే కాదు.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, తైక్వాండో, మా తాయ్, జుడో, బ్రెజిలియన్ జియు జిత్సు వంటి వాటిల్లో నైపుణ్యం పొందాడు.

- Advertisement -

2008-2010 వరకూ అతడు నైపుణ్యం సాధించిన వాటిల్లో శిక్షణ ఇచ్చేవాడు. జాసన్ కు నలుగురు కొడుకులు ఉన్నారు. నటన విషయానికొస్తే.. పవర్ రేంజర్ మొదటి సీజన్లో గ్రీన్ రేంజర్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత వైట్ రేంజర్ గా మారిపోయాడు. గ్రూపుకు లీడర్ అయ్యాడు. మూడు సీజన్లు, 123 ఎపిసోడ్స్‌లో జాసన్ లీడ్‌గా నటించాడు. వైల్డ్ ఫోర్స్, టర్బో, జియో, డినో థండర్, మెగాఫోర్స్, నింజా స్టీల్, హైపర్ ఫోర్స్ వంటి వాటిల్లోనూ జాసన్ తన ప్రతిభను చూపాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad